పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదు.. టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.!

1001364828.jpg

కల్వకుర్తి నవంబర్ 15: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చేరువ చేయాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఎస్సై కానిస్టేబుల్ శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో నాణ్యమైన శిక్షణ పొందలేని యువతకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రెండో బ్యాచ్‌కు 90 రోజుల పాటు ప్రతిరోజూ 9 గంటల చొప్పున రాష్ట్రస్థాయి అధ్యాపకులతో తరగతులు నిర్వహించడంతో పాటు రోజువారీ పరీక్షలు, వారాంతపు గ్రాండ్ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.భవిష్యత్తులో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలోని స్కిల్ ఫ్యాక్టరీ ద్వారా ఏఐ,ఐటీ,భాషా నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందించడం తమకు ఎంతో ఉపయోగపడిందని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తూ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శేఖర్, శ్రీపతి, శ్రీనితో పాటు పలువురు పాల్గొన్నారు.

You may also like...