రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాకోహీర్ మండలం కొత్తూర్ (డి) గ్రామంలో నిర్వహించిన ఆదిత్యాది నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలోజహిరాబాద్శా సనసభ్యులు మాణిక్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. ఆలయాలు ఆధ్యాత్మికతకు, భక్తిభావానికి ప్రతీకలని, ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు భగవంతుని ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, గ్రామ సర్పంచ్ మాణిక్ ప్రభు , మండల పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు……
