గాలిపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

నిజాంసాగర్ మండలం గాలిపూర్ రైస్ మిల్ సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమై, విడిభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆటో డ్రైవర్ మృతి చెందినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

You may also like...