5కే రన్‌లో మెరిసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్

WhatsApp Image 2026-11-14 at 19.32.27.jpeg

వాస్విక్ ఫౌండేషన్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా జనగామలోని బతుకమ్మ కుంట వద్ద నిర్వహించిన 5కే రన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శివగారి కిరణ్ కుమార్ ప్రతిభ చాటారు. బతుకమ్మ కుంట నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వరకు వెళ్లి తిరిగి బతుకమ్మ కుంటకు చేరుకునే ఐదు కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేశారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, మెడల్ అందుకున్నారు. గతంలో 10కే రన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసిన కిరణ్ కుమార్, ఈసారి 5కే రన్‌లోనూ ఉత్సాహంగా పాల్గొని తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు.రన్ ఫర్ వాటర్, రన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, రన్ ఫర్ ఎర్త్, రన్ ఫర్ హెల్త్, రన్ ఫర్ ఎడ్యుకేషన్ అనే ఐదు నినాదాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ సత్యనారాయణ రెడ్డి సైతం 5కే రన్‌ను పూర్తి చేశారు. వాసిక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ ప్రజాపతి, నూకల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ దంపతులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

You may also like...