జనగాం కాన్సెప్ట్ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
- ఘనంగా జనగామ జిల్లా పంచర్ షాప్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - November 15, 2026
- ఐక్యంగా ఉద్యమించాలి: జిల్లా సంయుక్త కార్యదర్శిగా యామంకి విజయ్ నియామకం - November 14, 2026
- బాలల హక్కులు, విధులు, బాధ్యతలపై అవగాహన - November 14, 2026

జనగాం కాన్సెప్ట్ పబ్లిక్ స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల్లో విద్యార్థులు ప్రముఖ వ్యక్తులు, స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకులు, పౌరాణిక పాత్రలతో పాటు సామాజిక సందేశాలను అందించే విభిన్న వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. తమ పాత్రలకు అనుగుణంగా చక్కని అభినయం, ఆత్మవిశ్వాసంతో ప్రసంగిస్తూ ప్రేక్షకులను అలరించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ధైర్యం, వేదికపై మాట్లాడే నైపుణ్యాలు పెంపొందుతాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, నిమ్మ రామ్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు నిమ్మ రూపా దేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ప్రతిభను అభినందించారు.
