ఖాజీపేటలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు
- ఐక్యంగా ఉద్యమించాలి: జిల్లా సంయుక్త కార్యదర్శిగా యామంకి విజయ్ నియామకం - November 14, 2026
- బాలల హక్కులు, విధులు, బాధ్యతలపై అవగాహన - November 14, 2026
- ఘనంగా రాష్ట్రస్థాయి సెపక్ తక్రా టోర్నమెంట్ ముగింపు వేడుకలు - November 14, 2026

నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి నారాయణ ప్రీమియర్ లీగ్ ఎన్పీఎల్ క్రీడా సంబరాలు ఖాజీపేటలోని నారాయణ పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హన్మకొండ జిల్లా వైద్యాధికారి ఎ. అప్పయ్య, ఖాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు.జోనల్ డీజీఎం రిజ్వానా ఇమ్రాన్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో టీమ్‌వర్క్, నాయకత్వ లక్షణాలు, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే ఎన్పీఎల్ లక్ష్యమన్నారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు.అనంతరం విజేతలకు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఫర్హానా, జోనల్ కో-ఆర్డినేటర్లు ఆకుల సాయికృష్ణ, శ్యామల, శిరీష, బానోత్ లక్పతి, వివిధ బ్రాంచ్‌ల ప్రధాన ఉపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
