కల్వకుర్తిలో కొత్త పింఛన్ల పంపిణీ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ అండ: ఎమ్మెల్యే కసిరెడ్డి

కల్వకుర్తి,నవంబర్ 14:కల్వకుర్తి నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన పింఛన్ల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.ప్రభుత్వం గీత కార్మికులు, దివ్యాంగులు,ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు పింఛన్లు అందిస్తూ వారి జీవనానికి భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్,వెల్దండ మండల పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, కల్వకుర్తి సింగిల్ విండో చైర్మన్ హరీశ్వర్ రెడ్డి, వెల్దండ పీఏసీఎస్ చైర్మన్ భూపతిరెడ్డి, ఆత్మ కమిటీ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.1001360815.jpg

You may also like...