బాధిత కుటుంబానికి మాజీ ఎంపీపీ జయప్రకాష్ రూ.10 వేల ఆర్థిక సాయం

1001298762.jpg

వెల్దండ,అక్టోబర్ 25:వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు కొమ్ము రమేష్‌ను మండల మాజీ ఎంపీపీ పకాడి జయప్రకాష్ ఆదివారం పరామర్శించి,తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా రమేష్ పరిస్థితిని అడిగి తెలుసుకున్న జయప్రకాష్,తక్షణ అవసరాల కోసం ఆర్థిక సాయం అందించారు.ఆపద సమయంలో బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.కార్మికుడికి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణారెడ్డి, నరసింహ, సత్తూరి శేఖర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

You may also like...