రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all)
- తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా గంగుల అంజలి యాదవ్ రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గురువారం హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అలకా లాంబా, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కమలాక్షి నటరాజన్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా గంగుల అంజలి యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మరోసారి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను కేవలం పదవిగా కాకుండా మహిళల హక్కుల పరిరక్షణ, వారి అభ్యున్నతి, సామాజిక సాధికారత కోసం పనిచేసే అవకాశంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మహిళా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. తనపై అధిష్ఠానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
రెండోసారి రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ పార్టీ నాయకత్వానికి మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
