హైటెక్స్‌లో పౌల్ట్రీ జాతర.! మంత్రి వాకిటి శ్రీహరికి ఘన ఆహ్వానం..!
- ఘనంగా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు బాలస్వామి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు.! - November 13, 2026
- ఎదురుచూపులకు తెర.. 4,203 మందికి పింఛన్ పండుగ! రేపు ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో పెన్షన్ పత్రాల పంపిణీ.! - November 13, 2026
- పోతేపల్లిలో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.! - November 13, 2026

హైదరాబాద్ నవంబర్ 12 :ఈనెల 24 నుంచి 27 వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో జరగనున్న 18న పౌల్ట్రీ ఇండియా ఇండస్ట్రియల్ షో కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి వాకిటి శ్రీహరిని తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు ఘనంగా ఆహ్వానించారు.తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు జూపల్లి భాస్కర్ రావు,సెక్రటరీ, పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు,పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించారు.దేశంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగ్జిబిషన్‌గా పేరుగాంచిన ఈ షోకు దేశ విదేశాల నుంచి పౌల్ట్రీ రంగ నిపుణులు, కంపెనీలు,రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు.పౌల్ట్రీ రైతులకు నూతన సాంకేతికత, ఆధునిక పద్ధతులు, మార్కెట్ అవకాశాలపై ఈ షోలో అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమాన్నివిజయవంతం కావడానికి ప్రభుత్వ సహకారం అందించాలని ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.
