రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కొల్లూరు గ్రామంలో వి.బి.జి.ఆర్.ఎ.ఎం. నిధుల నుంచి పశువుల తాగునీటి సౌకర్యం కోసం రెండు నీటి తొట్టెల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.
గ్రామంలోని గేదెలు, ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు తదితర పశువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కడుపునిండా తాగునీరు అందించడమే ఈ నిర్మాణాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామంలో నీటి తొట్టెల ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వీరశెట్టి పాటిల్, గ్రామ అధ్యక్షుడు డప్పూరు సంగమేష్, సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, వార్డు సభ్యులు సి.హెచ్. మాణయ్య, ఎం. మొగులయ్య, డి. రామయ్య, వీరన్న పాటిల్, డి. బీరప్ప, సంగన్న, అధికారులు టీఏ కర్ణయ్య, పంచాయతీ కార్యదర్శి రవి, ఎఫ్ఏ చింతలగట్టు సుభాకర్, నాయకులు ఎర్రోళ్ల కృష్ణ, సతీష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ కుమారుడు టీ. యాదులు, ఉద్యానవన కమిటీ సభ్యులు సంగమేష్, డి. శ్రీశైలం, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.
