పొగమంచు కాటుకు యువకుడు బలి!
- పేదల ఇళ్లపై పాలకుల పంజా.. పోరుకు సిద్ధమైన బాధితులు! - November 9, 2026
- ఆర్ఎస్ఎస్కు సేవకులే బలం! - November 9, 2026
- జనగణనకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్! - November 9, 2026

జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంగారెడ్డి జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. న్యాల్కల్ మండలం న్యామతాబాద్ వద్ద పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో శ్రీకాంత్ (19) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న సాయికిరణ్ (20)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. దట్టమైన పొగమంచు కారణంగా రహదారిపై నిలిపి ఉంచిన లారీని బైక్‌పై వస్తున్న యువకులు గుర్తించలేకపోవడంతో ప్రమాదం జరిగింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే యువకుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పొగమంచు సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై వాహనాలను నిలిపే సమయంలో తగిన హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
