ఈదమ్మ బండ తండాలో రేపే భూమి పూజ.. భారీగా తరలండి – రాజు నాయక్

వెల్దండ,నవంబర్ 10 :వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఈదమ్మ బండ తండా లో భక్తి పర్వం మొదలవుతోంది.రేపు, నవంబర్ 11, బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ దుర్గా భవాని సేవాలాల్ మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ దుర్గా భవాని, సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ భూమి పూజ ఘనంగా జరగనుంది.ఈ పవిత్ర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల జిల్లా, తాలూకా స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్టు వెల్దండ మండల ఉపసర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు, బొల్లంపల్లి మాజీ ఉపసర్పంచ్ వడ్త్యావత్ రాజు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, నియోజకవర్గ ప్రజలందరూ సకాలంలో పాల్గొని ఈ పుణ్య కార్యాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.1001347118.jpg

You may also like...