తెలంగాణ రక్షణ సేనలోకి ఇద్దరు యువ నాయకులు.. ఘనంగా పార్టీలో చేరికలు!
- తెలంగాణ రక్షణ సేనలోకి ఇద్దరు యువ నాయకులు.. ఘనంగా పార్టీలో చేరికలు! - November 9, 2026
- అనారోగ్యంతో చికిత్స పొందుతున్న యువతికి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆర్థిక చేయూత - November 9, 2026
- భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం - November 8, 2026
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలోకి ఇద్దరు యువ నాయకులు చేరారు. నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు రఘు ముదిరాజ్, ఎల్లారెడ్డి మండలానికి చెందిన సంతోష్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని నూతనంగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఈగల ప్రభాకర్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
