అనారోగ్యంతో చికిత్స పొందుతున్న యువతికి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆర్థిక చేయూత

హైదరాబాద్: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన రైతు పూర్ర నారాయణ కుమార్తె పూర్ర స్వప్న తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆసుపత్రికి చేరుకుని ఐసీయూలో ఆమెను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి చికిత్స బిల్లును తగ్గించేలా చొరవ తీసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

You may also like...