జనగామ జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- జ్యోతి నగర్ జీఎంఆర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు - October 11, 2026
- జనగామ జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - October 11, 2026
- జనగామ వాసవి కాలనీలో వైభవంగా బతుకమ్మ సంబరాలు పూల పండుగతో పులకించిన మహిళాలోకం - October 11, 2026
జనగామ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 11న ఆదివారం ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించనున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో చంపక్ హిల్స్ సమీపంలో, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల వద్ద, డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలో కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం నెహ్రూ పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరి జనగామ చౌరస్తాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనగామ నియోజకవర్గ క్యాంపు కార్యాలయం ప్రకటనలో కోరింది.
