ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నివాసంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
- ఖరీదైన మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ శంషాబాద్లో కల్తీ మద్యం ముఠా గుట్టురట్టు - November 17, 2026
- నేను ఫిర్యాదు చేయలేదు మహిళా కమిషన్ నోటీసులపై బాధితురాలి క్లారిటీ. - November 13, 2026
- ఓం నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం - November 12, 2026

రాజేంద్రనగర్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ టీ. ప్రకాష్ గౌడ్ గారి నివాసంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, స్థానిక ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గాంధీజీ బోధించిన సత్యం, అహింస, మరియు శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛత సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
