అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు

కామారెడ్డి: పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో, అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ గారు గురువారం పరామర్శించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిట్టి మెల్ల విష్ణు తల్లి ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం కామారెడ్డి–సిరిసిల్ల రోడ్డులోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ యజమాని నవాబు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కూడా షబ్బీర్ అలీ గారు పరామర్శించారు. అనంతరం కామారెడ్డి పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామ్మోహన్ గారి తల్లి కాల మరణం చెందగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాద సమయంలో వారికి తన అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడుతూ, ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవడం తన బాధ్యత అని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...