రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాదాపూర్ గ్రామంలో గురువారం పౌర హక్కుల కోసం ప్రజల్లో అవగాహన తెలియజేయడానికి బీబీపేట మండలం ఎమ్మార్వో, ఆర్.ఐ, పోలీస్ శాఖ వారు, అలాగే ఎస్సీ ఎస్టీ హాస్టల్ వార్డెన్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ గ్రామంలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సులు సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మరియు వివిధ పార్టీల నాయకులు ఎస్సీ కాలనీలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హక్కులను ఏ విధంగా వినియోగించుకోవాలి దాని గురించి పూర్తి అవగాహన పోలీస్ శాఖ వారు మరి ఎమ్మార్వో గారు తెలియజేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీలపై ఎలాంటి అనుచిత వాక్యాలు కానీ దుర్భాషలు కానీ ఏ కులానికి చెందిన వారైనా దూషించిన వారిని క్షమించకుండా ధైర్యంగా వారిపై ఫిర్యాదు చేయాలని ఎవరికీ భయపడద్దని అధికారులు తెలియజేశారు. అదేవిధంగా రోడ్ల లింగం మాట్లాడుతూ రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన సంఘటనలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు అధికారులు ఏదైనా ఒక దరఖాస్తు వచ్చినప్పుడు బాధితుడిపై ఉండి బాధితులకు న్యాయం చేయాలని బాధితులను సమర్ధించే విధంగా సమస్యను సామరస్యం చేసే విధంగా వ్యవహరించకూడదని బాధితుల పక్షాన పోలీస్ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు వెన్నుదన్ను ఉండాలని కోరారు చాలా విషయాలలో చాలా సందర్భాలలో చాలా చోట్లలో పోలీసు వారు సామరస్యం చేయడానికి ప్రయత్నిస్తారని అలాంటి ప్రయత్నాలు చేయకుండా తప్పు చేసిన వారికి చట్టపరమైన శిక్ష అమల ఏవిధంగా వ్యవహరించాలని విన్నవించారు. ఈ విషయంపై సర్పంచ్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు వచ్చినా కచ్చితంగా తెలియజేయాలని లేదంటే పోలీస్ శాఖ వారికి రెవెన్యూ శాఖ వారికి దరఖాస్తు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు ఇదే సందర్భంలో ఎలినో ప్రభావంతో వర్షాపాతం ఈ వర్షాకాలంలో తక్కువ కావడంతో భూగర్భ జలాలు చాలా తక్కువ ఉంటాయని తెలియజేస్తూ అందరూ ఇంకుడు గుంతలు తీసుకోవుంటే భూగర్భ జలాలు పెరిగే వినియోగానికి నీరు వృద్ధిగా ఉంటుందని తెలియజేశారు.
