మండల స్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల క్రీడా పోటీలు
- మండల స్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల క్రీడా పోటీలు - October 2, 2026
- ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ - October 2, 2026
- పౌర హక్కుల తో పాటు ప్రజలు బాధ్యతలను గుర్తుంచుకోవాలి - September 30, 2026
మోమిన్ పేట్ మండల స్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల క్రీడా పోటీలు భవిత కేంద్రం వద్ద నిర్వచించడం జరిగింది ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని పాల్గొన్నారు ప్రత్యేక విద్యార్థుల కోసం చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. అవన్నీ కూడా ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. భవిత కేంద్రం కూడా అతి త్వరలో పూర్తి అయ్యేలా చూడాలని మండల విద్యాధికారి నర్సింలు గారికి చెప్పడం జరిగింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడల పోటీలు నిర్వహించడం జరిగింది వారికి మొమెంటో, ప్రశంస పత్రం, షిల్డ్ లు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల విద్యాధికారి కె నర్సింలు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ప్రత్యేక ఉపాధ్యాయులు దండు రమేష్, షోయబ్, మోహన్ విద్యార్థులు , తల్లిదండ్రులు పాల్గొన్నారు.
