కొట్లలో స్వచ్చ జల ధార..ఆరు తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత

వెల్దండ, సెప్టెంబర్ 30:ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కొట్ర గ్రామంలోని ఆరు తాగునీటి నిల్వ ట్యాంకులను ప్రత్యేక యంత్రాల సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరిచారు.ట్యాంకుల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా మార్చారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం,సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు.గ్రామ అవసరాలను గుర్తించి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొట్ర గ్రామ సర్పంచ్ శారద చెన్నయ్య, డిప్యూటీ సర్పంచ్, ఐక్యత ఫౌండేషన్ గ్రామ ప్రతినిధులు సాంపూరి అల్లాజి, సాంపూరి వెంకట్య, పోసయ్య, కృష్ణయ్య, తిరుపతయ్య, బండిగయ, సత్యం, వార్డు సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.1001223668.jpg

You may also like...