కల్వకుర్తిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం
- లింగారెడ్డి పల్లిలో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన సర్పంచ్ అన్వర్ పాషా - November 12, 2026
- లింగారెడ్డిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కు గౌరవ వేతనం అందజేత - November 11, 2026
- మాజీ సర్పంచ్ సోమయ్య గారి జ్ఞాపకార్థం జరుగుతున్న LPL – 6.. ఫైనల్లో డామినేటర్స్, లయన్స్ అమీతుమీ - November 10, 2026
కల్వకుర్తి, సెప్టెంబర్ 29: కల్వకుర్తి పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ, కాంస్య విగ్రహ ఏర్పాటు మరియు అంబేద్కర్ కూడలి అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు అఖిలపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.రేపు (సెప్టెంబర్ 30, 2026) ఉదయం 10:30 గంటలకు యుటిఎఫ్ (UTF) భవనంలో ఈ సమావేశం జరగనుంది. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మైనారిటీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొనాలని మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ మాజీ డైరెక్టర్ మబ్బు రామరాజు విజ్ఞప్తి చేశారు.
అంబేద్కర్ కూడలి అభివృద్ధితో పాటు విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.
