వైద్య విద్యకు అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్
- తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు - September 28, 2026
- కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.! - September 28, 2026
- నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు - September 28, 2026

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గంలోని వైద్య విద్యలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు నిరుపేద బిడ్డలు ఎంబిబిఎస్ లో సీటు సాధించిన తలకొండపల్లి మండలం,అంతరం గ్రామానికి చెందిన బొరిగే అరుణ్ కుమార్ మరియు కడ్తాల్ మండలం, మైసిగండి గ్రామానికి చెందిన గిరిజన ఆడబిడ్డ మల్లీశ్వరి నాయక్ లకు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ తనవంతుగా ఒక్కరికి 15,000/- రూపాయల చొప్పున ఇద్దరు విద్యార్థులకు రూ.30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ల సంఘం తలకొండపల్లి మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, హజిలాపూర్ గ్రామ సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్,అంతరం మాజీ సర్పంచ్ రాములు,హర్యానాయక్ తండా సర్పంచ్ కొర్ర శిరీష కృష్ణ నాయక్,మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పాండు నాయక్,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దారమోని గణేష్,సిద్ధమోని నరేష్ గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
