జూపల్లిలో భక్తిశ్రద్ధలతో గ్యార్మీ వేడుకలు.. హాజరైన భాస్కరరావు
- బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శ - September 27, 2026
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకై కాంగ్రెస్ ధర్నా - September 27, 2026
- బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీమంత్రి కేటీఆర్ ఘన నివాళి - September 27, 2026

చారగొండ సెప్టెంబర్ 27: చారగొండ మండలంలోని జూపల్లి గ్రామంలో గ్యార్మి వేడుకలను ముస్లిం యువకులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఖాదీర్ ముస్లింలు పాటించాలని పలువురు ముస్లిం మత పెద్దలు కోరారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాప ప్రక్షాళన గ్యారి షరీఫ్ ఉద్దేశమని ఆర్థిక లాభాలు వ్యక్తిగత స్వార్థాలతో ఆందోళన చెందుతున్న ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక చింతన పండుగ ప్రబోధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగపతి అనూష, మరి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.
