పుల్జాలకు పట్టిన బస్సు కష్టాలు తీరినట్టే.. ఎమ్మెల్యే చొరవతో నూతన బస్సు సర్వీసు ప్రారంభం

నాగర్ కర్నూల్ మండలానికి చెందిన పుల్జాల గ్రామ ప్రజల చిరకాల సమస్యకు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు.

1001344762.jpg

గత కొన్నేళ్లుగా పుల్జాల గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గమనించిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు చొరవ తీసుకున్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాగర్ కర్నూల్ టు మల్కాపూర్ – పుల్జాల, తాళ్లపల్లి, నడిగడ్డ, తెల్కపల్లి మీదుగా నూతన బస్సు మార్గాన్ని ప్రారంభించారు.ఈ బస్సు సర్వీసు ప్రారంభంతో పుల్లలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఎంతో సౌలభ్యం కలగనుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...