22వ వార్డులో ఘనంగా అన్నదాన కార్యక్రమం – హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కడకంచి బాలమణి శ్రీనివాస్ గారు

474d5b15-47f8-48f3-b5af-728f7b8fc056.jpg

జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కడకంచి బాలమణి శ్రీనివాస్ గారు హాజరయ్యారు.

22 వ వార్డ్ భక్తులు చైర్ పర్సన్ గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన చేతుల మీదుగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ బాలమణి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…

"అన్నదానం – మహాదానం. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. 22వ వార్డు ప్రజలు చూపిస్తున్న ఐక్యత, భక్తి శ్రద్ధలు నిజంగా అభినందనీయం. వినాయకుడు మన జనగామ ప్రజలందరికీ సకల శుభాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ఈ కార్యక్రమంలో భక్తులు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You may also like...