కల్వకుర్తి సీతారామాంజనేయ ఆలయంలో లడ్డూ వేలం – రూ.3.16 లక్షలు పలికిన గణేష్ లడ్డూ
- వెంకటాపూర్ లో ఘనంగా బీజేపీ దిమ్మె ఆవిష్కరణ - September 25, 2026
- వెంకటాపూర్ గణనాథుడికి తల్లోజు ఆచారి ప్రత్యేక పూజలు - September 25, 2026
- తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు - September 24, 2026
కల్వకుర్తి పట్టణంలోని శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయంలో బుధవారం వినాయక లడ్డూ వేలం పాట నిర్వహించారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టిన లడ్డూను వేలం వేయగా, స్థానికుడైన బ్రృంగి శ్యాంమోహన్ రూ.3.16 లక్షలకు దక్కించుకున్నారు.
అనంతరం వినాయక విగ్రహ దాతలు దుర్గాప్రసాద్, శివకుమార్ లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పసుల లలిత, రాచోటి శ్రీశైలం, వెంకట్ రెడ్డి, బాలసాయి, రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
