ఇంటర్ విద్యార్థులకు ఉద్యోగ భరోసా
- స్పీడ్ పోస్ట్‌తో గంజాయి దందా బట్టబయలు - July 2, 2026
- రైతు భరోసా మూడో విడత విడుదల - July 2, 2026
- హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు - July 2, 2026

- ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు శుభవార్త
- రెండు సంస్థలతో ఇంటర్ విద్యాశాఖ ఒప్పందాలు
- ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్న సంస్థలు
- ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు
- విద్యార్థుల ఉపాధి సామర్థ్యాల పెంపే లక్ష్యం
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్ విద్యాశాఖ శుభవార్త అందించింది. విద్య పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా రేడియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ సంస్థలతో ఇంటర్ విద్యాశాఖ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్, సంబంధిత సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యమని డైరెక్టర్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ఫార్మా రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు మెరుగైన కెరీర్ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
