నాగర్ కర్నూల్ జిల్లా SC/ST విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియమితులైన శ్రీనివాస్ నాయక్
- నాగర్ కర్నూల్ జిల్లా SC/ST విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియమితులైన శ్రీనివాస్ నాయక్ - September 24, 2026
- కల్వకుర్తిలో వినాయక మండపాలలో గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు - September 24, 2026
- నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ సెలెక్షన్స్ – క్రీడాకారులకు పిలుపు - September 24, 2026
అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన సందర్భంగా శ్రీనివాస్ నాయక్ గారు అచ్చంపేట శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలు తీసుకున్న శ్రీనివాస్ నాయక్ గారు, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అణగారిన వర్గాలైన SC/ST ల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. జిల్లాలో అణగారిన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
