లింగారెడ్డిపల్లి లో ఇంటింటికీ రెండు మొక్కల పంపిణీ

వెల్దండ మండలంలోని లింగారెడ్డి పల్లిలో :పచ్చదనం – పరిశుభ్రతలో భాగంగా లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో నేడు ఇంటింటికి రెండు మొక్కల చొప్పున పంపిణీ కార్యక్రమం

నిర్వహించారు.గ్రామంలో ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారు, ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు, గ్రామ మేట్ మల్లేపాకుల భాస్కర్ గారు, వార్డు సభ్యులు అకినమోని మల్లేష్ గారు, గ్రామ నేతలు సుధాకర్ రెడ్డి గారు, పబ్బు నిరంజన్ గారు, గ్రామ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

1001339606.jpg

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, మొక్కలను తమ పిల్లల వలే సంరక్షించాలని పిలుపునిచ్చారు.

You may also like...