జిఎంఆర్ కాలనీ లోని వినాయక మండపం కలశాన్ని దాతకు అందజేసిన శ్రీనివాస పూజారి
- జిఎంఆర్ కాలనీ లోని వినాయక మండపం కలశాన్ని దాతకు అందజేసిన శ్రీనివాస పూజారి - September 24, 2026
- లడ్డు, కలశం దాతలకు ఘన సత్కారం - September 24, 2026
- గణేశుని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి – మహా అన్నదానం నిర్వహించిన కోళ్ల సాయికుమార్ గౌడ్ - September 24, 2026
జిఎంఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కలశాన్ని దాత నూకల బాలురెడ్డికి శ్రీనివాస పూజారి అందజేశారు. వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కలశాన్ని దాతకు అప్పగించారు.వినాయక ఉత్సవాల సందర్భంగా మండపానికి కలశాన్ని అందించిన నూకల బాలురెడ్డిని ఈ సందర్భంగా కాలనీవాసులు అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దాతలు, భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పలువురు మురళి ఉప్పలయ్య నరేష్ ఉపేందర్ సత్యనారాయణ శ్రీనివాస్ రెడ్డి నరసింహారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.
