జిఎంఆర్ గణేష్ మండపానికి ఉత్తమ మండపం అవార్డు

జిఎంఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి ఉత్తమ గణేష్ మండపంగా బహుమతి లభించింది. జనగామ పట్టణ సీఐ సత్యనారాయణ గారు మరియు కె వి ఎల్ ఎన్ రెడ్డి గారు బహుమతిని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా జిఎంఆర్ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. గణేష్ ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో మండపాలను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను ప్రోత్సహించేందుకు ఇలాంటి బహుమతులు అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా భక్తిభావం మరింత పెంపొందుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

You may also like...