ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026
- ఓబీసీ సెల్ నూతన కమిటీలకు దరఖాస్తుల ఆహ్వానం - August 31, 2026

తెలంగాణలో విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.బీజేపీ చేపట్టిన ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ ఉద్యమంలో భాగంగా జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉడుగుల రమేష్, దేవరాయ ఎల్లయ్య, కొంతం శ్రీను, హరీష్, పెద్దోజు జగదీశ్, దూసరి శివకృష్ణ, తోకల హరీష్, గోధుమల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
