KCR బావమరిది శ్రీనివాసరావు మృతి
- గురుకుల అడ్మిషన్ల పేరుతో వసూళ్లు? - August 13, 2026
- వాయిదాల పర్వంతోముగిసిన పార్లమెంటు సమావేశాలు - August 13, 2026
- ప్రభుత్వ భూములు అమ్మకాలకేనా? - August 13, 2026

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
శ్రీనివాసరావు మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఉంచారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆస్పత్రికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాసరావు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా ఆస్పత్రికి చేరుకుని శ్రీనివాసరావు పార్థివదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. శ్రీనివాసరావు మృతిపట్ల కేసీఆర్, కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని నేతలు ప్రార్థించారు. బంధువులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చివరి నివాళులు అర్పించారు.
