మాజీ ఎమ్మెల్యే సిద్ధయ్య యాదవ్ మృతికి జైపాల్ యాదవ్ సంతాపం
- ఫేతేపూర్ ఫ్లైఓవర్‌పై భద్రత ఎక్కడ..? - September 24, 2026
- రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే - September 24, 2026
- తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు - September 23, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09:జనగామ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సిద్ధయ్య యాదవ్ ఆదివారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.వారి అకాల మరణం పట్ల కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, బి.ఆర్.ఎస్. పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ జైపాల్ యాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.ప్రజా జీవితంలో సిద్ధయ్య సేవలు చిరస్మరణీయమని, ఆయన అకాల మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని,ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.
