తల్లిపై దాడి చేసిన కొడుకు అరెస్ట్
- మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ - August 9, 2026
- విద్యార్థులపై దాడిపై అమిత్ షా మౌనం ఎందుకు? - August 9, 2026
- భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం - August 9, 2026

జ్ఞానతెలంగాణ ఝరాసంగం ఆగస్ట్09
మద్యం మత్తులో తల్లిపై దాడి చేసిన గాయపరిచిన వ్యక్తిని ఝరాసంగం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఝరాసంగం ఎస్సై కాంతి కుమార్ పాటిల్ కథనం ప్రకారం.. ఝరాసంగం మండలంలోనిజీర్లపల్లి గ్రామానికి చెందిన చెన్నివెంకట రాజు (35) మద్యానికి బానిసై తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు చేసేవాడు. జూలై 20వ తేదీన ఇంటి ముందు శుభ్రం చేస్తున్న తల్లి పేరుమ్మపై దుండగంగా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం రాజు అక్కడి నుండి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం. జీర్లపల్లి గ్రామంలో రాజును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
