చిలుకూరు పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా నక్క మాణిక్యం
- ఫేతేపూర్ ఫ్లైఓవర్‌పై భద్రత ఎక్కడ..? - September 24, 2026
- రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే - September 24, 2026
- తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు - September 23, 2026

చిలుకూరు పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నక్క మాణిక్యంను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యల పరిష్కారానికి పేరెంట్స్ కమిటీ కీలకంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో 10వ వార్డు మెంబర్ కవేలి తిరుపతిరెడ్డి, పొద్దుటూరు గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసిన నక్క మల్లేశం, మాజీ వార్డు సభ్యులు ధరణి కృష్ణ, చాకలి రాములు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాని ప్రభు, బూర్గుల మల్లేశం, నక్క గోపాల్, బూర్ధుల యాదయ్య, రామ్‌చందర్, యాదయ్య, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన నక్క మాణిక్యంను పలువురు అభినందించి, కమిటీ అధ్యక్షుడిగా విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
