ఆదివాసి ఆరోగ్యానికి జంపన్న అండ.. లక్ష్మీపురంలో ఉచిత వైద్య శిబిరం


జ్ఞానతెలంగాణ,గోవిందరావుపేట, ఆగస్టు 8:

గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భూక్య జంపన్న ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లక్ష్మీపురంతో పాటు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఉచిత మందులు పొందారు
డాక్టర్ బోట్ల ప్రవీణ్ నేతృత్వంలో డాక్టర్ కావ్య, డాక్టర్ ఎండి సలీం తదితర వైద్య బృందం రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహించి రోగులకు అవసరమైన వైద్య సలహాలు అందించింది. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా భూక్య జంపన్న మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి గ్రామపంచాయతీలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అందేలా సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని చెప్పారు.
శిబిరానికి హాజరైన గ్రామస్తులు భూక్య జంపన్న సేవలను అభినందిస్తూ, ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీతో ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలను మరిన్ని గ్రామాల్లో నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బోధం ముత్తయ్య, గాంధర్ల బాబు, సర్పంచ్ లకావత్ జుమ్మిలాల్, గ్రామ పార్టీ అధ్యక్షుడు జల్లెల కొమరయ్య, ఎండి అబ్దుల్ అజీజ్, గాంధర్ల మోహన్, ఈక రామారావు, సల్లూరి రామకృష్ణ, గాంధర్ల వెంకటేష్, గజ్జి కొమురయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు లకావత్ నరసింహ, గజ్జి ఎలేందర్, వార్డు సభ్యురాలు బక్క సరిత, భూక్య దేశోజి, పెట్టి రాజు, బాదావత్ రాజ్ కు
మార్, అజ్మీర బిక్కు నాయక్, లకావత్ ప్రతాప్, శంకర్, వీరమల్లు ఆస్పత్రి పీఆర్వో సలీం తదితరులు పాల్గొన్నారు.

You may also like...