మార్కెట్ కమిటీ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
- చెందిప్ప గేట్ హనుమాన్ ఆలయం పరిసరాల్లో రసాయన పౌడర్ - September 23, 2026
- “విజయం ఒక్కరోజులో రాదు.. పట్టుదలతో సాగిన ప్రతి అడుగూ విజయానికి పునాది.” - September 22, 2026
- స్వర్ణ సంచలనం..లంకపై భారత్ ఘన విజయం! - September 22, 2026

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి, ఆగస్టు 8:
శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శనివారం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.
ఈ సందర్భంగా అమ్మవారి కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రైతులు, వ్యాపారులు సుఖసంతోషాలతో ఉండాలని, వ్యవసాయ మార్కెట్ మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.
పూజా కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సాగింది.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రశాంత్, భాస్కర్ రెడ్డి, సంతు, మల్లేష్, శేఖర్‌తో పాటు మార్కెట్ కమిటీ సిబ్బంది, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు
