వేములవాడలో డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ప్రత్యేక పూజలు
- చేవెళ్ల బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు - August 7, 2026
- రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు - August 7, 2026
- రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య - August 7, 2026

రాజన్న జోన్-3 డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.
దక్షిణకాశిగా పేరొందిన వేములవాడకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో నిరంతర పోలీసు గస్తీ, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించడం, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన దర్శన వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఐజీ స్పష్టం చేశారు.
