మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం
- ప్రతి మహిళ దుర్గాదేవిలా హిందూ సంస్కృతిని, దేశాన్ని రక్షించాలి - October 22, 2026
- పొద్దుటూరు గ్రామంలో ఘనంగా పండగల సాయన్న జయంతి వేడుకలు
- October 22, 2026 - అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏడుపాయలలో భవాని మాత నిమజ్జనం - October 22, 2026

– హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత
– హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన సత్యనారాయణ
– శోకసంద్రంలో హరీశ్ రావు కుటుంబ సభ్యులు
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతితో హరీశ్ రావు కుటుంబంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసమైన క్రిన్స్ విల్లాస్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచారు. ఈ విషయం తెలియగానే పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. హరీశ్ రావును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
