మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం
- హత్నూరలో వేడెక్కిన రాజకీయాలు: జైభీమ్ వర్సెస్ జైశ్రీరామ్ నినాదాలతో ఉద్రిక్తత - October 21, 2026
- జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ప్రారంభం - October 21, 2026
- రెబల్స్‌గా బరిలోకి దిగితే సస్పెన్షన్ తప్పదు! - October 21, 2026

– హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత
– హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన సత్యనారాయణ
– శోకసంద్రంలో హరీశ్ రావు కుటుంబ సభ్యులు
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :
బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతితో హరీశ్ రావు కుటుంబంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసమైన క్రిన్స్ విల్లాస్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచారు. ఈ విషయం తెలియగానే పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. హరీశ్ రావును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
