ప్రజల ఆశీర్వాదంతో మరింత ముందుకు వెళ్తా

  • బిఆర్ఎస్ కార్యకర్తగా, ప్రజా సేవకుడిగా, ప్రజల మనిషిగా ఆదరణ గుర్తింపు పొందుతూ ముందుకు సాగుతా
  • బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ జ్ఞాన తెలంగాణ – పటాన్ చేరు :

ప్రజా సేవల పట్ల మక్కువ – పార్టీ ఆదేశాలకు కట్టుబాటు – కష్టపడి ఎదిగిన రైతు కుటుంబానికి వారసుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ అన్నారు,అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలు వినిపించుకొని పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్న నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్. చిన్న వయసులోనే సామాజిక సేవలపై ఆసక్తి పెంచుకొని, బిఆర్ఎస్ పార్టీ సిద్దాంతాలను ప్రజల్లో విస్తృతంగా చేరవేయడానికి కృషి చేస్తున్నారు.
రైతు కుటుంబం నుంచి ఎదుగుదల:
ఐలాపూర్ మాణిక్ యాదవ్ రైతు కుటుంబంలో పుట్టి పెరిగారు. వ్యవసాయ కష్టాలు చూసి పెద్దవారైన ఆయన విద్యారంగంలో కష్టపడి ముందుకు సాగారు. చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ, అనేక కష్టాలు ఎదుర్కొంటూ B.Tech, M.Tech,LLb, ఉన్నత చదువులను పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక నిపుణుడైన అడ్వకేట్‌గా పనిచేస్తూ ప్రజలకు ఉచిత లీగల్ సర్వీసులు అందిస్తున్నారు.ప్రజా సేవే లక్ష్యం
మాణిక్ యాదవ్ ఎప్పుడూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శుద్ధి నీరు, డ్రైనేజ్, విద్యుత్ సమస్యలు, పబ్లిక్ ఫెసిలిటీస్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తూ, వృద్ధులు – మహిళలకు సహాయం చేస్తున్నారు.
పార్టీ నమ్మకమే బలం:
“పార్టీ కష్టకాలంలో పార్టీ జెండా పట్టుకుని నడిపించిన వ్యక్తిని నేను” అని గర్వంగా చెప్పే మాణిక్ యాదవ్, ఎప్పుడూ పార్టీతోనే కట్టుబడి ముందుకు సాగుతున్నారు. “నా చదువులన్నీ ప్రజల కోసమే… నా వృత్తి కూడా ప్రజా సేవకోసమే. పార్టీ నమ్మకమే నా బలం – ప్రజల ఆశీస్సులే నా ఆస్తి” అని చెబుతున్నారు.

భవిష్యత్ లక్ష్యం – కార్పొరేటర్ పదవి:
ప్రస్తుతం మాణిక్ యాదవ్ భవిష్యత్తులో కార్పొరేటర్ పోస్ట్‌కు పోటీ చేసి, ప్రజల ఆశీస్సులతో గెలిచి, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని సంకల్పించారు. కేటీఆర్ గారు, బిఆర్ఎస్ సీనియర్ నేతలు ఇచ్చే మార్గదర్శకత్వంతో ముందుకు సాగుతూ, ప్రజా సేవను జీవిత లక్ష్యంగా కొనసాగిస్తున్నారు.

You may also like...

Translate »