మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం.!

1001368384.jpg

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 16: వెల్దండ మండలంలోని ఓ కుటుంబానికి ఆపద సమయంలో వెల్దండ సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి భాస్కరరావు ఆర్థిక చేయూత అందించారు. చెదురుపల్లి గ్రామానికి చెందిన కొమ్ము చిన్న అంజయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన వెల్దండ మండల సింగిల్ విండో మాజీ చైర్మన్ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.గ్రామ సర్పంచ్ దన్‌సింగ్ ఆధ్వర్యంలో ఈ సాయం అందించారు.ఈ కార్యక్రమంలో పోలే అశోక్, కటికే మధుసూదన్ రెడ్డి, పోలే వెంకటయ్య, పోలే తిరుపతి, మహేష్ గౌడ్, మందగల రాజశేఖర్, పోలే నల్లాల కృష్ణయ్య, కొమ్ము అంజయ్య, కొమ్ము నారయ్య, కొమ్ము వెంకటయ్య, కొమ్ము జగన్, కొమ్ము బాబు లాలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...