Daily Archive: September 18, 2026
కడ్తాల్, సెప్టెంబర్ 17: కడ్తాల్ గడ్ పై డబ్బులేక కంటి చూపు కోల్పోయి చీకట్లో మగ్గుతున్న పేదలకు దేవుడిలా అండగా నిలుస్తున్నారు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు,టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.ఎంబీఏ గార్డెన్స్ లో ప్రపంచ ప్రఖ్యాత శంకర నేత్రాలయ, చెన్నై వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం నేడు 7వ రోజుకు చేరుకుంది.ఈ శిబిరానికి ఇప్పటివరకు 5,500 మందికి పైగా హాజరయ్యారు. అందులో 3,600 మందికి ఉచిత…
చిన్నారుల స్నేహబంధం. ఘనంగా వినాయక చవితి వేడుకలు
వెల్దండ సెప్టెంబర్ 17: వెల్దండ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ తండాలలో గురువారం గిరిజనులు తెలంగాణ జాతిపిత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించి గిరిజన ప్రాంతాలకు స్వపరిపాలన అవకాశం కల్పించిన ఘనత కేసీఆర్ దక్కుతుందని గిరిజనులు అభిప్రాయపడ్డారు. మండలంలోని రాంపూర్ తండా, లక్ష్మానాయక్…
వెల్దండ సెప్టెంబర్ 17: వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జాతీయ జెండా ప్రతీకగా నిలుస్తుందని, ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రజా పాలన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. గ్రామంలో…
జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకదారుల సంఘానికి చెందిన 4 ఎకరాల 04 గుంటల భూమిని ఉస్మానియా అగ్రో ఇండస్ట్రీస్ వారు అక్రమంగా, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సంఘ సభ్యులు ఆరోపించారు.సంఘంలో దాదాపు 60 మంది సభ్యులు ఉన్నారని, ఈ భూమిని గొర్రెల పెంపకదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం గొర్రెల పంపిణీ / వరహాల పథకం కింద కేటాయించిందని తెలిపారు. ఇట్టి భూమికి సర్వే నెం. 582/F లో గల…
ఘనంగా ప్రజాపాలన దినోత్సవంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 17 : ప్రజాపాలన దినోతవాన్ని గురువారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తాసీల్దార్ కార్యాలయంలో పుష్పలత, మండల పరిషత్ కార్యాలయంలో అంజన్ రెడ్డి, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మునుగోటి రవీందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి జమున, వ్యవసాయ శాఖ కార్యాలయంలో గిరిప్రసాద్, పీఏసీఎస్ లో సీఈఓ బండ మల్లారెడ్డి, ఆయా గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీల్లో సర్పంచ్ లు జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. వేర్వేరు…
వెల్దండ : వెల్దండ మండలం చౌదర్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ రాజీవ్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ చంద్రకళ మాట్లాడుతూ.. పోషకాహారంతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు జయ ,కమల, ఆయా అనంతమ్మ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఉమ్మనమైన యాదమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతురాలికి పూలమాలతో నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం రూ.5000 రూపాయలను అందజేశారు. కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు నిరంజన్, లింగం, వార్డు సభ్యులు…
వెల్దండ సెప్టెంబర్ :వెల్దండ మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన వసంత (40) అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ గురువారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.3 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.అదైర్య పడకూడదు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎగిరి శెట్టి పద్మ శివకుమార్, ఆంజనేయులు, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.