Daily Archive: September 17, 2026
సిర్పూర్(టి): మండలంలోని పారిగాం గ్రామం నుంచి ప్రాణహిత నదికి వెళ్లే దారి వర్షాలతో బురదమయంగా మారింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో రైతుల పొలాలు ఉండటంతో వ్యవసాయ పనుల కోసం నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో బురద కారణంగా వాహనాలు, ఎడ్లబండ్లు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంటోందన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఫామ్ రోడ్డు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
అంబేద్కర్‌పై విమర్శలు.. రాజ్యాంగంపై దాడేమాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 16 : ప్రపంచ దేశాలు జ్ఞానానికి ప్రతీకగా గౌరవించే డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచేలా పుస్తకాలు వెలువరించడం సరికాదని మాల మహానాడు నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు బిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌పై జరుగుతున్న దాడిని యావత్ భారతదేశంపై, భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా పరిగణించాలని ఆయన డిమాండ్…
వెల్దండ సెప్టెంబర్ 16: వెల్దండ బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కురుమిద్దె యాదగిరి ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యశాల నిర్వహించారు. మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్, నరసింహ, శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు, రాజు రెడ్డి, జంగయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్ సెప్టెంబర్ 16: కడ్తాల్ మండలంలోని వాసుదేవ్‌పూర్, మైసిగండి, కడ్తాల్ గ్రామాలకు చెందిన ముగ్గురు మృతుల కుటుంబాలకు మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తన రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా తలా రూ.5 వేల చొప్పున మొత్తం రూ.15 వేల సాయం అందజేశారు. కడ్తాల్ గ్రామానికి చెందిన నాగమణి కుటుంబానికి మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ అదనంగా రూ.5 వేలు అందజేశారు.
వెల్దండ సెప్టెంబర్ 16 : గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని వెల్దండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రఘు వీర్ రెడ్డి సూచించారు. డీజే సౌండ్‌కు అనుమతి లేదని, మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు పరిమిత శబ్దంతో వాడాలని, విద్యుత్ వైరింగ్ సురక్షితంగా ఉండాలని, మద్యం సేవించి ఉత్సవాల్లో పాల్గొనరాదని, ఇతర మతాలను కించపరిచే బ్యానర్లు పెట్టరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, నిమజ్జన సమయంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని…