శంకర్‌పల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
- రౌండ్-16లోకి దూసుకెళ్లిన సింధు
- September 26, 2026 - రాత్రి అన్నం మానేస్తేనే బరువు తగ్గుతారా? - September 26, 2026
- కాచిగూడలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి - September 26, 2026

జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి ప్రతినిధి,సెప్టెంబర్ 26:శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ క్వార్టర్స్ వైపు వెళ్లే దారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, చామనఛాయతో ఉన్నట్లు తెలిపారు. మృతుడు తెల్లటి రంగు ప్యాంట్, కాఫీ కలర్ షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి ఆచూకీ లేదా కుటుంబ సభ్యుల వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తించినట్లయితే శంకర్పల్లి పోలీసులకు 8712554103 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. మృతుడి వివరాల గుర్తింపునకు ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
