కిస్మత్‌పూర్‌లో ఘనంగా గణేష్ లడ్డూ వేలం రూ. 2.40 లక్షలకు దక్కించుకున్న ఎలుగని ఉదయ్ కిరణ్ గౌడ్.

275584.jpg

కిస్మత్‌పూర్‌ : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు ముగింపు వేడుకల్లో భాగంగా కిస్మత్‌పూర్‌లో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట భక్తుల ఉత్సాహం, కోలాహలం మధ్య ఘనంగా సాగింది. ఇక్కడి స్థానిక 'టీమ్ షాందార్స్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లడ్డూ వేలం పాటను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.భక్తుల మధ్య తీవ్ర పోటీ నడుమ సాగిన ఈ వేలం పాటలో ఎలుగని రాజు గౌడ్ తనయుడు ఎలుగని ఉదయ్ కిరణ్ గౌడ్ రికార్డు స్థాయిలో 2,40,000 రూపాయలకు లడ్డూను పాడుకుని దక్కించుకున్నారు. స్వామివారి ప్రసాదాన్ని ఇంతటి భారీ ధరకు కైవసం చేసుకోవడం పట్ల ఆయన తన భక్తిని చాటుకున్నారు.లడ్డూను దక్కించుకున్న ఎలుగని ఉదయ్ కిరణ్ గౌడ్‌ను ‘టీమ్ షాందార్స్’ నిర్వాహకులు మరియు స్థానికులు శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఈ సందర్భంగా భక్తులు ఆకాంక్షించారు. వేలం ద్వారా సేకరించిన ఈ నిధులను మండప నిర్వాహకులు తదుపరి సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

You may also like...