సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్..!కొంగరకలాన్‌లో పోస్టర్ ఆవిష్కరణ
- ధర్మం నీ వైపు ఉంటే.. ప్రపంచం నీకు ఎదురైనా భయపడకు - September 4, 2026
- కృష్ణుడు నేర్పింది ఒక్కటే.. కర్తవ్యాన్ని చేయి, ఫలితాన్ని కాలానికి వదిలేయి - September 4, 2026
- పరిస్థితులు మారకపోతే.. నీ ధైర్యమే పరిస్థితులను మార్చాలి - September 4, 2026

కొంగరకలాన్ IDOCలో TGEJAC రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఛైర్మన్ ఊటు యశ్వంత్, కన్వీనర్ డా. రామారావు మాట్లాడుతూ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, నాలుగో తరగతి ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సంఘటితంగా తరలిరావాలని కోరారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వంపై తమ డిమాండ్లను బలంగా వినిపించాలని వారు పిలుపునిచ్చారు.
