జీపీల అభివృద్ధిపై సమన్వయంతో పని చేయాలి : ప్రత్యేక అధికారి సతీష్ కుమార్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 28 : గ్రామపంచాయతీ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మండల ప్రత్యేక అధికారి సతీష్ కుమార్ అన్నారు. సోమవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రామపంచాతీల అభివృద్ధి. సామర్థ్య వృద్ధి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. అధికారులు పూర్తి సమాచారంతో జనరల్ బాడీ సమావేశానికి హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సభలో వివిధి అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. కట్టంగూర్ లో విద్యుత్ లో ఓల్టేజీ సమస్య నెలకొందని పలు మార్లు మండల సభలో అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీడీఓ గంట అంజన్ రెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ ఆల్బట్ ప్రాంక్లిన్, ఎంపీఓ శారదారాణి, సర్పంచ్ లు, వివిధ శా ఖల అధికారులు పాల్గొన్నారు.

You may also like...